ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

వెబ్ న్యూస్,బతుకమ్మ : హైదరాబాద్-బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ లేక్ వ్యూ ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో ఉన్న కరెంట్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.  ఆందోళనతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.