Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 12:19 pm Posted by : ramakrishna

భారీ భూకంపం.. రష్యా, జపాన్లను తాకిన సునామీ

రిక్టర్ స్కేల్ పై  8.8 తీవ్రతతో నమోదు

వెబ్ న్యూస్, బతుకమ్మ: రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.8 గా నమోదైనట్లు జపాన్ వాతావరణశాఖ ఈవిషయాన్ని వెల్లడించింది.   రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్ కు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కొద్దిసేపటికే రష్యా, జపాన్ లను సునామీ తాకింది. భూ ప్రకంపనల తో పెట్రో పావ్లోవ్క్స్ – కమ్చట్కా నగరంలోని భవనాలు కంపించాయని, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు రష్యా మీడియా పేర్కొంది. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్ లోని హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులులో సునామి హెచ్చరిక సైరన్లు మోగడంతో ప్రజలు భయంతో నివాస ప్రాంతాలను వీడుతున్నారు. 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈస్థాయిలో భూకంపం వచ్చింది.

తరలుతోన్న రాష్ట్రం

అమెరికాలోని ద్వీప రాష్ర్టం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారైంది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. దీంతో రాష్ట్రమంతా సునామీ సైరన్లు వినిపించాయి. ఒక్కసారి గా ప్రజలంతా తరలుతుండటంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి.