భిక్కనూరు ఎమ్మెస్ఎన్ కంపెనీ ఎదుట కార్మికుల భారీ ధర్నా
సరిగా వేతనాలు, సమయ వేళలు ఇవ్వడం లేదని ఆరోపణ బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో శనివారం మధ్యాహ్నం డైలీ వైస్ లేబర్ లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. కంపెనీ గేటు వద్ద బైఠాయించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ తమకు హెచ్ఆర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తమతో పనిచేస్తున్నారని, ఈఎస్ఐ పీఎఫ్ కట్ చేయడం...