Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 5:05 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట మండలం బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు గుండ బాలకిషన్, ఎల్లమ్మ తండా గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఆంటోనీ, లింగంపేట్ టౌన్ మున్నూరు కాపు సంగం ఉపాధ్యక్షుడు కడారి రమేష్, లింగంపేట్ 5 వ వార్డ్ మెంబర్ బెస్త సాయిలు, 9. వ వార్డ్ మెంబర్. మంగలి రమేష్. 14. వ వార్డ్ మెంబర్ నాగయ్య, మేoగారం గ్రామం బిఆర్ఎస్ నాయకులు రాకేష్ గౌడ్, రాజ గౌడ్, తంత్రి గంగయ్య, పుట్ట బాల పోచయ్య, కుమ్మరి విట్టల్. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు 20 సంవత్సరాలుగా చెయ్యని అభివృద్ధి ఎమ్మెల్యే 18 నెలలో చేసి చూపించారని తెలిపారు. రాష్ట్రం లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ మరో మూడు కోట్ల 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతరం కృషి చేశారన్నారు. నిధులు తీసుకురావడమే కాకుండా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పర్యవేక్షించడం ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు తలెత్తితే సరిదిద్దడం వల్లనే సకాలంలో ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం జరిగిందని వారు అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరామని తెలిపారు.