బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో కాంగ్రెస్, పార్టీనుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ మరింత బలోపేతమైంది. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు. ఈ చేరికలు అధికార కాంగ్రెస్, పార్టీ కి గట్టి ఎదురుదెబ్బగా స్థానికులు భావిస్తున్నారూ. పెద్ద దేవడ గ్రామంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు గ్రామంలోని పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కష్టకాలంలో పార్టీవెంట ఉన్నవారినే గుర్తిస్తామని నియోజకవర్గంలో చేసిన సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని అన్నారు రాష్ట్రంలో మరియు స్థానిక ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కానీ బిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఇది ప్రజలను మోసగించిన “బోగస్ 420 హామీల” ప్రభుత్వం అని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, సరైన పాలన లేదని ఆయన అన్నారు. ముఖ్యంగా “ఇందిరమ్మ ఇండ్లు” పథకం ఒక మోసపూరితమైన పథకమని స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం “రైతు భరోసా” నిధులు విడుదల చేసిందని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోసలు పడుతున్నారని,తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ చేతిలో నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, గడపగడపకు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, త్వరలోనే కమిటీలు వేసి కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, డాక్టర్ రాజు మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.