ఏఐఎస్ఏ విద్యార్థి సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏఐఎస్ఏ విద్యార్థి సంఘానికి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా  ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ గా వివిధ జిల్లాల్లో విద్యారంగ సమస్యల పట్ల చురుకుగా విద్యార్థి ఉద్యమాలు నిరంతరం  నిర్వహిస్తున్న క్రమంలో పార్టీలో రాష్ట్ర నాయకత్వాన్ని కాదని ఆంధ్ర పెత్తనం మొదలైందన్నారు. దాంతో విద్యార్థి సంఘానికి సలహాదారుడిగా వ్యవహరించేటటువంటి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ ఆంధ్ర పెత్తనంతో ఇబ్బంది పాలవుతుందనితెలిపారు. తెలంగాణ ఐసా రాష్ట్ర...