Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 5:54 pm Posted by : ramakrishna

ఏఐఎస్ఏ విద్యార్థి సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏఐఎస్ఏ విద్యార్థి సంఘానికి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా  ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ గా వివిధ జిల్లాల్లో విద్యారంగ సమస్యల పట్ల చురుకుగా విద్యార్థి ఉద్యమాలు నిరంతరం  నిర్వహిస్తున్న క్రమంలో పార్టీలో రాష్ట్ర నాయకత్వాన్ని కాదని ఆంధ్ర పెత్తనం మొదలైందన్నారు. దాంతో విద్యార్థి సంఘానికి సలహాదారుడిగా వ్యవహరించేటటువంటి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ ఆంధ్ర పెత్తనంతో ఇబ్బంది పాలవుతుందనితెలిపారు. తెలంగాణ ఐసా రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన యొక్క అజమాయిషిని తట్టుకోలేక విసిగిపోయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నాయకులు రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ముక్కుమ్మడిగా రాజీనామాలు చేయడంతో తెలంగాణలో ఐసా విద్యార్థి సంఘం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా రాజీనామాలు చేసిందని ఈ విషయాన్ని అందరూ గమనించాలని తెలిపారు. రాజీనామా చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రాజీనామాల అనంతరం విద్యారంగ సమస్యలపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేసినటువంటి ఐసా నాయకత్వం మొత్తం కూడా టీఎస్ఏ పేరుతో నూతనంగా తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ గా ఏర్పడి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా విద్యారంగ సమస్యలపై కొత్త ఎజెండాను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.