సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాల ఎదుట మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్యులు మాట్లాడుతూ ఆజ్ఞానం మూర్తీభవించిన ఆనాటి సమాజంలో ఒక వెలుగు రేఖ, మోసగింపబడిన యువతులను కన్నతల్లిగా ఆదరించిన తల్లిసావిత్రిబాయి పూలే1831 జనవరి 3 న దక్షిణ మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించిందని తెలిపారు.  సావిత్రిబాయి పూలే ఆమె భర్త మహాత్మ జ్యోతిరావు పూలే  దగ్గర కుల మతాలు సమాజానికి చేస్తున్న కీడు...