కమ్మర్ పల్లి, బతుకమ్మ : రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ యూకేఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో గురువారం నిర్వహించిన రైతు ధర్నాకు కమ్మర్ పల్లి, మోర్తాడ్ మండలాల మాస్ లైన్ తరలివెళ్లారు.
తొమ్మిది ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని దేశ వ్యాప్తంగా ఐక్య రైతు సంఘం పిలుపులో భాగంగా ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో నాయకులు, ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు జి.కిషన్, కమ్మర్ పల్లి మండల కార్యదర్శి బి అశోక్, మండల అధ్యక్షుడు ఉట్నూర్ బాలయ్య, రైతు సంఘాల నాయకులు దయాల్ సింగ్, దర్శన్ సింగ్, డాక్టర్ శ్రీనివాస్ , మహిళా సంఘం నాయకురాలు గంగా పోషక పద్మ, జి పద్మ తదితరులు ఉన్నారు.