ప్రభుత్వ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించిన అనంతరం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి అంజల్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక తరగతుల ప్రారంభించడం పట్ల ఉపాధ్యాయుల కృషిని ఎంఈఓ అభినందించారు. పూర్వ ప్రాథమిక తరగతుల విద్యా బోధనకు నియమించిన ఇన్స్ట్రక్టర్, ఆయా, ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది...