Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 5:23 pm Posted by : ramakrishna

అమరవీరుల సంస్కరణ సభ

రుద్రూర్, బతుకమ్మ : పార్టీ పిలుపు మేరకు రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో బుధవారం సి.పి.ఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు బుజ్జి స్వామి అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి మందు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సభలో బోధన్  డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ..భారత దేశంలో వర్గ పీడన, దోపిడీ, కుల వ్యవస్థ, మతాలు, మూడ నమ్మకాలు, సాంఘిక, రాజకీయ అసమానతలు, ఆర్థిక అంతరాలు పోవాలని, మనిషిని మనిషి పీడించే సమాజం అంతరించి నిండైన, మెండైన ప్రజాస్వామిక  సమాజం రావాలని సోషలిస్టు సమాజం స్థాపించాలనే ఆశయాన్ని వారి యావత్ జీవితాన్నే అర్పించారని వారి పోరాటాలను, త్యాగాలను స్మరించుకుని వారికి ఘనమైన నివాళులు అర్పించి, వారి ఆశయ సాధనకై ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈ.అశోక్,  డి. నాగేష్, మీరా, బి.రవి, టి. లాలయ్య, బి. శ్రీనివాస్, డి. సాయిలు, కే. శ్రీనివాస్, గైని. ప్రభాకర్, అంగిర్గా సాయబ్రావు,కే.భూపేందర్,టి. శ్రీనివాస్,  లలిత, గోదావరి, అనసూయ, లత, కిష్టవ్వ,దుర్గా, జాహిద, సురేఖ, కౌసర్,సావిత్రి, ఎం.కల్పన, కే.సౌజన్య, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.