Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 4:41 pm Posted by : ramakrishna

జాతీయ జెండా కోసం బలిదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ జెండా కోసం బలిదానం అయిన విద్యార్థి నాయకుడు సామా జగన్మోహన్ రెడ్డి అని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కైరి శశిధర్ అన్నారు.  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కవిత కాంప్లెక్స్ లో ఘనంగా సామాజియన్ మోహన్ రెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కైరి శశిధర్ మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వలస పాలన దాస్య శృంకలాల నుండి విముక్తి చేయడం కోసం ఎంతోమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా, ఆ విదేశీయుల వలసవాద భావజాలాన్ని, నింపుకున్న కొందరు స్వదేశీయులు దేశాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. వారి ప్రయత్నాలను తిప్పికొట్టి, యువతలో దేశభక్తి, జాతీయ భావజాలాన్ని పెంపొందించే క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు ఎంతోమంది ప్రాణాలు అర్పించారని తెలిపారు. అటువంటి మహానుభావులలో సామా జగన్మోహన్ రెడ్డి ఒకరు. విదేశ భావజాల కమ్యూనిస్టులు దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ, డా బాబాసాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ దేశంలో నక్సలిజం పేరుతో అరాచకాలు సృష్టిస్తున్న సమయంలో, జాతీయ జెండా గౌరవం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వెంకటకృష్ణ,  కండక్టర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్,  ప్రేమ్ వాసు, విష్ణు, సాత్విక్, ఈశ్వర్, సన్నీ, అభినవ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Martyrdom for the national flag