ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని హన్సన్ పల్లి గ్రామానికి చెందిన వివాహిత మహిళా ఈనెల 23న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా కుటుంబీకులు గమనించి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన తాళ్ల శ్రావణి (26) చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తాళ్ల శ్రావణి మృతి చెందినట్లు ఇందల్వాయి ఎస్సై భుక్యా సుమలత తెలిపారు. ఈ మేరకు మృతురాలి తండ్రి నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతురాలు గత కొన్ని నెలలుగా మానసిక స్థితి కోల్పోయి అప్పుడప్పుడు భయందోళనకు గురయ్యేదని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వివరించారు. మృతురాలు సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందినదని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశంలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆమె అన్నారు.