నాగేంద్ర నగర్‌లో కమ్యూనిటీ సోక్‌పిట్, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలకు మార్కింగ్
ఏర్గట్ల, బతుకమ్మ : నాగేంద్ర నగర్ గ్రామంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా కమ్యూనిటీ సోక్‌పిట్, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ నిర్మాణాలకు స్థల గుర్తింపు చేసి మార్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సందే రంజిత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సందే రంజిత్ మాట్లాడుతూ, గ్రామంలో వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం, భూగర్భ జలాల స్థాయిని పెంచడం కోసం కమ్యూనిటీ సోక్‌పిట్, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు....