ఏర్గట్ల, బతుకమ్మ :
నాగేంద్ర నగర్ గ్రామంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా కమ్యూనిటీ సోక్‌పిట్, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ నిర్మాణాలకు స్థల గుర్తింపు చేసి మార్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సందే రంజిత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సందే రంజిత్ మాట్లాడుతూ, గ్రామంలో వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం, భూగర్భ జలాల స్థాయిని పెంచడం కోసం కమ్యూనిటీ సోక్‌పిట్, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నిర్మాణాల కోసం అనువైన స్థలాన్ని గుర్తించి మార్కింగ్ ఇచ్చామని, వీటి ద్వారా వర్షపు నీరు భూమిలోకి చేరి భూగర్భ జలాలు పెరగడంతో పాటు గ్రామంలోని బోర్‌వెల్‌లలో నీటి మట్టం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ జాకీర్, గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.