ఎల్లారెడ్డి, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గం లోని కౌలాస్ నాలా ప్రాజెక్టుని ఆదివారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా కౌలాస్ నాలా ప్రాజెక్టు కు దిగువన ఉన్న విట్టల్వాడి, సావర్గావ్ పలు గ్రామాలలోని ఆరుతడి పంటలు కందులు, జొన్నలు, గోధుమలు ఆరుతడి పంటలను పరిశీలించారు. ఆయనతోపాటు దిశ డైరెక్టర్ దేశముఖ్ రాజు, మాజీ జెడ్పిటిసి సామెల్, సొసైటీ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శకావతలి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ గఫర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్, బిక్కనూర్ సంజీవరెడ్డి, అడవి లింగాల శ్రీనివాసరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.