మార్క్ ఫెడ్ చైర్మన్ అవినీతికి పాల్పడ్డాడంటూ రిలేనిరాహార దీక్ష
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఛైర్మన్, తెలంగాణ మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి అవినీతికి పాల్పలడ్డాడంటూ శుక్రవారం అదే గ్రామానికి చెందిన వినోద్ రెడ్డి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంకాపూర్ గ్రామంలోని సొసైటీకి చెందిన గోదాం అమ్మిన డబ్బులు రూ.25లక్షలు, విరాళంగా వచ్చిన మరో రూ.5లక్షలకు సంబంధించిన లెక్కలు చూపడం లేదన్నారు. గత నెలలో రూ.30లక్షలకు సంబంధించిన లెక్కలు చూపాలని లిఖిల పూర్వకంగా పీసీఎస్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామని తెలిపారు....