బోకర్ నుంచి ఇందూర్ కు గంజాయి రవాణా
యువకుడి అరెస్ట్.. 6.5 కిలోల గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిల్లారోడ్ లోని అమన్ నగర్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో షేక్ మీరాజ్ అనే యువకుడు బైక్ పై వెలుతుండగా తనిఖీ చేయడంతో అతని వద్ద 6.5...