Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 3:08 pm Posted by : ramakrishna

బోకర్ నుంచి ఇందూర్ కు గంజాయి రవాణా

  • యువకుడి అరెస్ట్..
  • 6.5 కిలోల గంజాయి స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిల్లారోడ్ లోని అమన్ నగర్ లో తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీలలో షేక్ మీరాజ్ అనే యువకుడు బైక్ పై వెలుతుండగా తనిఖీ చేయడంతో అతని వద్ద 6.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా కు చెందిన ఫారుఖ్ ఖురేషీ నుంచి నిజామాబాద్ కు చెందిన మేరాజ్ గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయాలు చేస్తున్నట్టు విచారణలో  తెలిందని ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ తెలిపారు. ఫారుక్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్ఐ నర్సింహచారీ, సిబ్బంది విష్ణూ, భూమన్న, అవినాష్, బోజన్న, ఉత్తమ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.

Marijuana transport from Bokar to Indore