కారుతో పోలీసులకు ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్

కాల్పులు జరిపిన సీఐ వెబ్ డెస్క్, బతుకమ్మ : వాహనంతో పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు యత్నించిన గంజాయి స్మగ్లర్ పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద జాతీయ రహదారపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరానికి చెందిన భీకర ప్రకాష్ అలియాస్ సూర్య ప్రకాష్ కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్ వాహనంతో వేగంగా పోలీసులను ఢీ కొట్టి పరారయ్యేందుకు...