- కాల్పులు జరిపిన సీఐ
వెబ్ డెస్క్, బతుకమ్మ : వాహనంతో పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు యత్నించిన గంజాయి స్మగ్లర్ పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద జాతీయ రహదారపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరానికి చెందిన భీకర ప్రకాష్ అలియాస్ సూర్య ప్రకాష్ కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్ వాహనంతో వేగంగా పోలీసులను ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కు గాయాలవ్వడంతో ఆత్మరక్షణ కోసం బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 22కేజీల గంజాయిన స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఈగల్ సెల్ ఐజీ రవి క్రిష్ణ, ఎస్పీ క్రుష్ణకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్ ను పరామర్శించారు.