Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 5:02 pm Posted by : ramakrishna

గంజాయి పట్టివేత

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా నిషేధిత గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఐదో టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐదో టౌన్ పోలీసులు గురువారం బాబన్ సహబ్ పహాడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ కు దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన హోనుశెట్టి రవి, నాందెడ్ జిల్లా సిద్దనత్ పురి, మందై, ఇత్తర ప్రాంతానికి చెందిన సయ్యద్ జిలానీ అనే ఇద్దరు పల్సర్ బైక్ పై అనుమానాస్సదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారి పోయారు. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టకున్నారు. వారిని విచారించగా వారి వద్ద 390గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.