Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 6:46 pm Posted by : ramakrishna

గంజాయి, మత్తు పదార్థాలను నియంత్రించాలి

  • మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చుకుందాం
  • నార్కోటిక్ డిఎస్పి పుప్పన్ కుమార్

 

బతుకమ్మ  భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి , భిక్కనూర్, జంగంపల్లి ,పెద్ద మల్లారెడ్డి గ్రామాలలో శనివారం తెలంగాణ యాంటీ నార్కోటిక్ ఆధ్వర్యంలో డ్రగ్స్, కల్తీకల్లు గంజాయి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డిఎస్పి పుప్పన్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి ,కల్తీ కల్లును నిర్మిలిద్దాం మన సమాజాన్ని కాపాడుదామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి మరియు కల్తీ కళ్ళు తీసుకునే వ్యక్తి శారీరకంగా మానసికంగా కృంగి కుశించిపోతారని వాటి వలన ప్రాణం పోతుందని యువత ప్రజలు వీటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ మరియు గంజాయి కల్తీకల్లు (అల్ఫాజూ డైజోఫామ్) సంబంధించి ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ సంపత్ కుమార్ ఎస్సై ఆంజనేయులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి భిక్కనూరు పంచాయతీ సెక్రెటరీ మహేష్ గౌడ్ ఎక్సైజ్ మెడికల్ అధికారులు వీడిసి చైర్మన్లు పాల్గొన్నారు.

Marijuana and narcotics should be controlled.