Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 6:00 pm Posted by : ramakrishna

రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలు

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక,ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలు నిర్వహించాలని  మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనా మాట్లాడారు. జై బాపు జై భీం జై సంవిధన్ అనే కార్యక్రమం అందరి భవిషత్ కొరకు చేపట్టడం జరిగిందన్నారు.  దేశ ప్రజలకు సమాన హక్కులు సమన్యాయం కల్పించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న బిజెపి నాయకుల తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుందని తెలిపారు.  అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్రస్థాయిలో, ఈరోజు జిల్లా స్థాయిలో, 28వ తేదీ వరకు మండల స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశాలు నిర్వహించి గ్రామ గ్రామాన పాదయాత్రలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ ప్రజలకు అన్నిటి పైన ఆంక్షలు పెడుతూ ప్రజల హక్కులను భంగం చేస్తుంది అని, రాజ్యాంగ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన కొనసాగిస్తుందని దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత భారత పౌరులు అందరి పైన ఉందని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆప్రజాస్వామిక పనులను ఎండగడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరే వేసే విధంగా పాదయాత్రలు కొనసాగాలని మండల అధ్యక్షులకు కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులు తమ సమయాన్ని కేటాయించి ప్రజలకు రాజ్యాంగ విలువలు అందించే విధంగా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేయాలని ఆయన అన్నారు.   ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,మాజీ ఎమ్మెల్యే ఆరికల నర్సారెడ్డి, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సంతోష్, నుడ చైర్మన్ కేశ వేణు,  బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి,ఆర్మూర్ ఇంచార్జి వినయ్ రెడ్డి,ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ ఏబీ శ్రీనివాస్,పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి,మార్క్ ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి,ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,మాజీ పీసీసీ కార్యదర్శి రం భూపాల్,మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్,రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా ఫిషర్మాన్ అధ్యక్షులు శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు అవెజ్ ఖాన్,ఈసా,సుమన్,సాకినాల శివ కుమార్, పి గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,వివిధ మండలాల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Marches aimed at protecting the Constitution