ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ ను కలిసిన మార ప్రభు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి మార ప్రభు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాతగుప్తాను హైదరాబాద్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ఆమెతో చర్చించారు. ఆమె చిత్రపటాన్ని బహూకరించి సన్మానించారు.