పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతి
హైదరాబాద్, బతుకమ్మ : ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పూజారి కంకేర్ మారేడు బాక అడవుల్లో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శి గా పనిచేస్తున్నా బడే చొక్కా రావు ఆలియాస్ దామోదర్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతిచెందినట్లు మావో యిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు...