Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 4:56 pm Posted by : ramakrishna

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల సంచల ప్రకటన

  • పార్టీని వీడుతున్నట్లు క్యాడర్ కు లేఖ

 

హైదరాబాద్, బతుకమ్మ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల సంచల ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు క్యాడర్ కు లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ కు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితిలో పోలీసులు సభ్యుడిగా కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. సాయుధ పోరాట విరమణ పై స్పష్టమైన ప్రకటన చేశారు.  ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు విడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ పేర్కొన్నారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేక పోయామంటూ క్షమాపణలు తెలిపారు. పార్టీ క్యాడర్ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమేనని అభిప్రాయపడ్డారు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మన లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు పిలుపునిచ్చారు.