Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 6:06 pm Posted by : ramakrishna

ఆటో టైర్ పేలి పలువురికి గాయాలు

బతుకమ్మ,మెండోరా:మెండోరా మండల కేంద్రానికి సమీపంలో సోమవారం ఆటో ప్రమాదం జరిగింది. బుస్సాపూర్ నుండి మెండోరా  వైపు వెళ్తుండగా ఆటో టైర్ పేలింది. దీంతో ఆటో చెట్టును ఢీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పదిమందికి గాయాలైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆ ప్రయాణికుల్లో చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. అందరికీ స్వల్ప గాయాలు కావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.