బతుకమ్మ బాన్సువాడ : కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నస్రుల్లాబాద్ మండలం అంకోల్, దుర్కి, అంకోల్ తండా, దామరంచ గ్రామాల్లో సోమవారం కల్తీకల్లు తాగిన పలువురు వ్యక్తులు తీవ్ర అస్వస్థత కు గురయ్యారు.దీంతో స్థానికులు కొందరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మరికొందరిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ కు తరలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..