Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2024, 12:53 pm Posted by : ramakrishna

మెడికవర్ కార్డుతో అనేక ప్రయోజనాలు

. వైద్య సేవలలో సరికొత్త ఆవిష్కరణ

. ఏసీపీ రాజావెంకట్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ ‘మెడి కవర్డ్ ఫ్యామిలీ కార్డ్’ తీసుకురావడం అభినందనీయమని ఏసీపీ రాజావెంకట్ రెడ్డి అన్నారు. మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డ్ ను ఏసీపీ శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ.. ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ఆర్థిక స్థోమత గురించి చింతించకుండా కుటుంబ సంరక్షణ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఫ్యామిలీ కార్డు ముందడుగు అని పేర్కొన్నారు.  పేరు, వయస్సు, అడ్రస్, బ్లడ్ గ్రూప్, ఫోన్ నంబర్ తదితర వివరాలను అందించిన వెంటనే డిజిటల్ కార్డును జారీ చేస్తామని, ఆ తరువాత ఫిజికల్ కార్డును అందజేస్తామని తెలిపారు. కార్డు పొందిన వారికి 23 మెడికవర్ ఆస్పత్రుల్లో ఓపీ కన్సల్టేషన్ పై 30శాతం తగ్గింపు, అవుట్ పేషెంట్ సేవలపై 15శాతం, ఇన్ పేషెంట్ సేవలపై 10శాతం ఉంటుందని, ఒక కుటుంబంలో గరిష్టంగా నలుగురు లబ్ధి పొందొచ్చని వివరించారు. కార్డుపై రివార్డులు ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెటింగ్ హెడ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.