మణుగూరు, బతుకమ్మ : మణుగూరు ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక కేసు విషయంలో బాధితుడిని రూ.40వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు ఎస్ఐకి రూ.40వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.