మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు బతుకమ్మ, జుక్కల్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ 13వ ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు కొనసాగి, దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి గొప్ప కృషి చేసిన ప్రముఖ నాయకుడని...