Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 3:43 pm Posted by : ramakrishna

 ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నేత మన్మోహన్ సింగ్

  • మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ, బతుకమ్మ : దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మోహన్ నాయక్, అంజిరెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, ఖలేక్, గంగారాం తదితరులు పాల్గొన్నారు