Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 8:09 pm Posted by : ramakrishna

యాదవ ఇంటెలెక్చవల్ ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా మంజులా యాదవ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా యాదవ ఇంటెలెక్చవల్ ఫోరం అధ్యక్షురాలిగా మంజులా యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు యాదవ ఇంటెలెక్చవల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కమిటీకి గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నియామకపత్రాలు అందజేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన మంజులా యాదవ్ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. యాదవ ఇంటెలెక్చవల్ ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా మంజులా యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడిగా మహేష్ యాదవ్ (సర్పంచ్), ఎర్రం గణేష్ లను నియమించగా ప్రధాన కార్యదర్శిగా గుజ్జ అశోక్ యాదవ్, కార్యదర్శి 1గా గిరియాదవ్, కార్యదర్శి 2 గా దినేష్ యాదవ్, అధికార ప్రతినిధిగా ప్రవీఃణ్ యాదవ్, కోశాధికారిగా లక్ష్మణ్ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా గంగాధర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సంజీవ్ యాదవ్, అనూష యాదవ్ లను నియమించారు. నిజామాబాద్ జిల్లాలో యాదవ సామాజిక వర్గం అభ్యున్నతికి పాటుపడుతామని నూతన జిల్లా అధ్యక్షురాలు మంజులా యాదవ్ అన్నారు.