జుక్కల్, బతుకమ్మ :
హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న మామిడిపండ్ల లారీ మద్నూర్ మండలం రుశేగావ్ గేట్ సమీపంలో బుధవారం బోల్తా పడింది. జాతీయ రహదారి 161 పై డివైడర్ ని ఢీ కొట్టి లారీ పక్కకు ఒరిగిపోయి పడిపోయింది. డ్రైవర్ కి సరైన నిద్ర లేకపోవడం వల్లే అదుపు తప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంతో లారీలోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. క్రేన్ సాయంతో లారీని పక్కకు తొలగించారు. డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.