Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 8:01 pm Posted by : ramakrishna

మండల మహిళా సమాఖ్య సమావేశం 

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలో మండల  సమైక్య అధ్యక్షురాలు రాజమణి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఐబీడీపీఎం శ్రీనివాస్ హాజరై మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కుటుంబ అవసరాల నిమిత్తం  లోన్లు తీసుకొని రెగ్యులర్ గా ఈ ఎం ఐ లు కట్టుకోవాలి. ప్రతి గ్రామ సంఘం అధ్యక్షురాలు బాధ్యతగా ఉండి పని చేయాలి గ్రామ సంఘాలలో అన్ని కార్యక్రమాలను అమలు చేసే అవకాశం అధ్యక్షురాలు కు ఉంటుంది. లోన్ లు తీసుకున్నా వారు ప్రతి నెల రెగ్యులర్  కట్టుకోని మహిళా సంఘాల అభివృద్ధి కొరకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు రాజమణి, గంగలక్ష్మి ,విజయ శైలజ గ్రామ సంఘాల మహిళలు పాల్గొన్నారు.