Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 5:59 pm Posted by : ramakrishna

గడ్కోల్ లో అమరవీరులను స్మారక మండల స్థాయి క్రీడా పోటీలు

  •   సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ 

సిరికొండ, బతుకమ్మ : కష్టజీవుల రాజ్యం కోసం పరితపించి, పీడీత ప్రజల కోసం పోరాడి అమరులైన గడ్కోల్ అమరవీరులను స్మారాకర్థం సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి  క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ తెలిపారు.  బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మండలంలోని గడ్కోల్ గ్రామం విప్లవయోధ్యమాలకు కేంద్ర భిందువుగా నిలిచిందన్నారు. పెత్తనందారుల దోపిడీని ప్రజల్ని సమీకరించి పోరాడిన దాంట్లో గడ్కల్ అగ్రగ్రామీగా నిలబడ్డదన్నారు. గడ్కోల్ గ్రామంలో ప్రజల్లో నిలబడి అనేక మంది కామ్రేడ్స్ పోరాడిన చరిత్ర ఉందన్నారు.  ముఖ్యంగా కామ్రేడ్. పిట్ల. ఎల్లన్న, కామ్రేడ్. మూల్గు. రాజేందర్, మందాపురం. నడ్పిరాజాగౌడ్, అన్నందాస్. నర్సయ్య, ఒడ్డెం.లక్ష్మణ్ లు మండలంలో అనేక పోరాటల్లో అగ్రభాగనా నిలబడి పోరాడారన్నారు. ఒకవైపు అతివాదం, మితవాదం, అవకాశవాదం లాంటి అన్నీ విధానాలను త్రిప్పికొట్టి సీపీఐ(ఎం. ఎల్)ప్రజాపంథా (మాస్ లైన్) రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాడానికి ముందు నిలిచారన్నారు. అలాంటి అమరుల  స్మారకార్థం  గడ్కోల్ లో జనవరి 15,16 తేదీల్లో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఇట్టి పోటిల్లో ప్రథమ, ధ్వితీయ బహుమతులతో పాటు క్రీడాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రత్యక జ్ఞాపికాలను అందించడం జరుగుతుంది అన్నారు. వాలీబాల్, కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతితో పాటు రూ.5000/- నగదు, ధ్వితీయ బహుమతితో పాటు రూ.3000/- నగదు ను అందజేయడం జరుగుతుంది అన్నారు. గడ్కోల్ అమరుల స్మారక క్రీడాలను క్రీడాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్ లో సీపీఐ (ఎం. ఎల్)ప్రజాపంథా (మాస్ లైన్) ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్.దామోదర్, బి.బాబన్న, జి.సాయిరెడ్డి, మండల నాయకులు ఈ.రమేష్,ఎం.లంబాద్రి,బి.కిశోర్, అనిస్,ఎస్.కిశోర్, కె.ఆశిస్, బి. సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.