భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల వారి ఓటరు జాబితా పై, వార్డు వారిగా అన్ని గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసే పోలింగ్ స్టేషన్ల పై అవగాహన కల్పించి వాటి పై అభ్యంతరాలను తెలుసుకొనేందుకు శనివారం మండల పరిషత్ కార్యాలయం లో అధికారులు మండల స్థాయి అవేర్నస్ అండ్ అబ్జెక్షన్ మీటింగ్ ను నిర్వహించారు. రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులకు నిర్వహించిన ఈ మీటింగులో ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు గురించి అధికారులు సవివరంగా తెలిపారు. ఈ ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై ఎవరు ఎలాంటి అభ్యంతరాలు వెలిబుచ్చలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ , మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.