Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 5:09 pm Posted by : ramakrishna

బీసీ రిజర్వేషన్ బంద్ కు మండల కాంగ్రెస్ బీసీ సెల్ మద్దతు

బతుకమ్మ,ఏర్గట్ల: తెలంగాణ రాష్ట్ర  సంపూర్ణ బిసి బంద్ కు రాష్ట్ర బీసీ సంఘల ఐక్యత కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం స్థాయిలో అన్ని మండలములోని అన్ని గ్రామమాల లో బీసీ లకు 42 % రిజర్వేషన్లు విద్య, ప్రభుత్వ, రాజకీయాల లో సాధన కోసం తమిళనాడు రాష్ట్రంలో కల్పించినట్లు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి రాజ్యాంగములోని 9 వ షెడ్యూలు లో పెట్టి బీసీ వర్గాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ తో బీసీ ల ఐక్యత కోసం కలిసి కట్టుగా బంద్ కు సహకారం చెయ్యాల ని ఏర్గట్ల మండల బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చారు.రేపు బందు కు బీసీ లకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి జనాభా తమాషా ప్రకారం బీసీ లకు రావాల్సిన రిజర్వేషన్ కల్పించే విధముగా పూర్తి మద్దతు తెలుపాలని కాంగ్రెస్ బీసీ కమిటీ డిమాండ్ చేసినారు. బీసీ డిమాండ్ ఎవరికి వ్యతిరేకం కాదు, మాకు జరుగుతున్న అన్యాయం గురించి అర్థం చేసుకొని మా న్యాయమైన హక్కులను అడుగుతున్నాం. రేపు బందుకు అందరూ దయచేసి సహకరించాలని ఏర్గట్ల మండల బీసీల సంఘం కోరుతున్నది. ఈ బంద్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేర ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది.అన్ని గ్రామములో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఈ బంద్ కు సహకరించాలి.ఇట్టి కార్యక్రమంలో బీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దండవోయిన సాయి కుమార్,మునిమాణిక్యం అజయ్,జంగల గణేష్,రాగుల నగేష్,దొబ్బల చిన్న కిషన్,మెరుగు సురేష్,కల్లెడ పురుషోత్తం,ఏనుగంటి సాయి,కురకుల రమేష్,మాసం శివకుమారు,మినుములు సాగరు,పాకాల ప్రసాద్ గౌడ్,మదాస్తూ చినయ్య,పుల్లూరు గణేష్,తదితరులు పాల్గొన్నారు.