Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2024, 3:18 pm Posted by : ramakrishna

బాన్సువాడ పట్టణ సీఐ గా భాధ్యతలు స్వీకరించిన మండల అశోక్‌

బాన్సువాడ, బతుకమ్మ:   

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ సిఐగా మండల అశోక్‌ మంగళవారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడ సీఐగా ఉన్న క్రిష్ణను మల్టీ జోన్ 1 ఐజి కార్యాలయంకు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అయన స్థానంలో నియమితులు ఐనా అశోక్ భాధ్యతల స్వీకరించి మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగాకుండా చూసుకుంటానని, అసాంఘిక కార్యకలాపాలు నడిపే వారి సమాచారం అందిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌ సిబ్బంది పట్టణ సిఐకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు…