Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 9:01 pm Posted by : ramakrishna

సన్న రకం ధాన్యాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని నాగిరెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ సన్న రకం వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులు తమ సన్న రకం వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగేశ్వర్ స్థానిక రైతులు ఉన్నారు.