. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కులగణనపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏబీసీ వర్గీకరణకు ఆమోదం తెలపడంపై ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శాసన సభ, శాసన మండలి వర్గీకరణకు పచ్చ జెండా ఊపడం హర్షణీయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్ ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహంతోపాటు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఏబీసీ వర్గీకరణను ముఖ్యమంత్రి ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాదిగలు రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, నేడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ బి సి వర్గీకరణను ఆమోదు తెలపడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా నాయకురాలు పోసాని, గంగాధర్, గిరిబాబు, బోధన్ ఇన్చార్జి లింగయ్య, ఎడపల్లి మండల అధ్యక్షులు సామ్యూల్, మోపాల్ మండల అధ్యక్షుడు పోతన్న, నగర యువసేన అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.