Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2025, 8:17 pm Posted by : ramakrishna

మందకృష్ణ మాదిగ ప్రజాసేవకు పద్మశ్రీ అవార్డు రావడం అభినందనీయం

  • తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నలభై ఏళ్ల ప్రజా సేవా జీవితంలో ముప్ఫై ఏండ్ల సామాజిక ఉద్యమాన్ని నడిపి, అంటరాని జాతికి ఆత్మగౌరవం నేర్పిన నేత, ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త, వికలాంగుల పెన్షన్ల ప్రదాత, వృద్దులు, వితంతువుల బతుకులకు దిక్కై, తెలంగాణ అమరుల వీరుల కుటుంబాల భరోసై, తెల్ల రేషన్ కార్డుదారులకు అన్నం మెతుకై, ఆడ బిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన ఎంఆర్పీయస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు రావడం అభినందనీయమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముప్ఫై ఏళ్లుగా సామాజిక మానవీయ ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసి  కోట్లాది మంది పీడిత, తాడిత పేద ప్రజల కోసం ఎన్నో అరుదైన పథకాలను సాధించి పదవులు లేకుండా ప్రజలకు సేవ చేసిన త్యాగమూర్తి మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.