Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 7:37 pm Posted by : ramakrishna

రేపు కామారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి లో ఈఎస్ఆర్ గార్డెన్లో ధర్మయుద్ధ మహాసభ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ  రానున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు తెలిపారు. పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల దే బాధ్యతని ప్రకటించందని తెలిపారు. ఆగస్టు 1న రేవంత్ రెడ్డి  అసెంబ్లీలో నేను ముందు ఉంటానని దేశంలో డీఎస్సీ ఫలితాలు వెలవలకముందే వర్గీకరణ అమలు చేసి తీరుతానని నిండు అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. కానీ ప్రకటన విలువ విలువలు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ లేకుండా డీఎస్సీ ఫలితాలు ప్రకటించి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ద్రోహం చేశారని అన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున మాదిగ యువకులు, ఉద్యోగులు, మహిళలు  తరలివచ్చి మందకృష్ణ మాదిగ అండగా ఉండాలని కోరారు. ఈ కార్య్రకమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి,  యాదగిరి కుత్తుల పుల్లూరి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.