ఎంఆర్పిఎస్ నాయకుడిని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

బతుకమ్మ, కోటగిరి : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సోంపూర్ గ్రామంలోని పోచీరాం స్వగృహానికి  వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ... కార్యకర్తలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలకు అన్నివేళల అండగా నిలుస్తామని ఆయన అన్నారు.