సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సన్మానించిన మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని హోటల్ కాకతీయలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్ శ్రీ మంద కృష్ణ మాదిగ శాలువా కప్పి, బొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్ట్ 7మంది సభ్యుల గల బెంచ్ లో సభ్యులు, సుప్రీం కోర్ట్ లో ప్రప్రథమంగా అడ్మినిస్ట్రేషన్ లో రిజర్వేషన్స్ ను ప్రవేశపెట్టి సామాజిక అసమానతలు రూపుమాపడానికి శ్రీకారం చుట్టిన సామాజిక న్యాయ కోవిధుడు జస్టిస్ గవాయ్...