హైదరాబాద్, బతుకమ్మ : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. YOLO 247 అనే బెట్టింగ్ యాప్‌ను ఆమె ప్రమోట్ చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో విచారణ కోసం ఆమె తన బ్యాంక్ స్టేట్‌మెంట్లను వెంట తీసుకొని వచ్చారు. బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సినీ నటులు ప్రకాష్ రాజ్ ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటలు, దగ్గుబాటి రాణాలను కొద్ది గంటలపాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.