పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్
ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మంచిప్ప, మోపాల్, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది, మంచిప్ప గ్రామం, పరిసర తండాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పష్టం చేశారు. మంచిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్తులకు, చుట్టుపక్కల తండాలకు ఈ దవాఖాన ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు...