- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పై సమీక్ష సమావేశం
హైదరాబాద్, బతుకమ్మ : మంచిప్ప చెరువును పాత డిజైన్ ప్రకారము అభివృద్ధి చేసి లక్షా 82వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని జల సౌద కార్యాలంయలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆదివారం నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి ప్రతిపాదించిన విధంగా, మంచిప్ప చెరువును పాత డిజైన్ ప్రకారం అభివృద్ధి చేసి లక్షా 82వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని నీటి పారుదల శాఖ ప్రతిపాదనలపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు (మైనార్టీ,ఎస్పీ,బీసీ) షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారులు (నీటిపారుదల) ఆదిత్య నాథ్ దాస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
