Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 6:42 pm Posted by : ramakrishna

సభాస్థలిని పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అక్టోబర్ 4న నిర్వహించే బహిరంగ సభాస్థలిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  మానాల  మోహన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమింపబడిన తర్వాత మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా స్వాగత ర్యాలీ, పాత కలెక్టర్ గ్రౌండ్ నందు బహిరంగ సభను నిర్వహిస్తున్న సందర్భంగా  ఎసిపి  రాజ వెంకట్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా సభా స్థలికి రావడానికి మార్గా,న్ని సభకు వచ్చిన ముఖ్య అతిథులు తమ వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని, వచ్చినా కార్యకర్తలు, ప్రజలు కూర్చోవడానికి వారి వాహనాలకు స్థలాన్ని పరిశీలించారు. వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్ , జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేణు రాజ్  ఉన్నారు.

Manala, president of the district congress committee, inspected the assembly hall